ASR: రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గిరిజన ప్రాంతంలో 100 శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.