W.G: కొవ్వూరు స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారా, ఇతర నేరాల్లో పట్టుబడిన మోటారు వాహనాలకు వేలం వేయనున్నారు. రాజమహేంద్రవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈనెల 26న ఉదయం 11గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కొవ్వూరు ఎక్సైజ్ స్టేషన్ అధికారి తెలిపారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనేందుకు రూ.5వేలు చెల్లించాలన్నారు.