ప్రకాశం: చంద్రశేఖరపురంలోని భైరవకోనలో ఈనెల 26న జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్ల పనులను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.