VSP: ఎలమంచిలి పట్టణం కొత్తపేట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం పునఃనిర్మాణం పేరుతో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు పిల్లా నూకేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎలమంచిలి తహశీల్దార్‌కు ఆయన వినతిపత్రం అందించారు.