TG: హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఆరేళ్ల బాలుడు ఇరుక్కున్నాడు. విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది ఎంతో చాకచక్యంగా లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని కాపాడారు. అనంతరం ప్రాథమిక చికిత్స కోసం బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.