VSP: హనుమంతువాకలోని విజయదుర్గ కాలనీలోని విజయ దుర్గ వార్షిక మహోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ కమిటీ స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. అమ్మవారు నగర ప్రజలను కాపాడాలని, నగరాభివృద్ధి జరిగేటట్లు చూడాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.