TG: హైదరాబాద్లోని గచ్చిబౌలి సిద్ధిఖీనగర్లో నిర్మాణం పక్కన గుంతలు తవ్విన బిల్డర్ శ్రీను అలియాస్ కల్వకోలు శ్రీనుపై కేసు నమోదు అయింది. సిద్ధిఖీనగర్లో ఐదు అంతస్తుల భవనం ఒక వైపుకు ఒరగడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని GHMC అధికారులు ఫిర్యాదు చేశారు. బిల్డర్ అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా గుంతలు తవ్వారని శేరిలింగంపల్లి GHMC సిటీ ప్లానర్ వెంకటరమణ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.