TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ లా రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబులా రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని సీఎం రేవంత్ ను కోరారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పెద్ద సంస్థలతో చంద్రబాబు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని.. మన దగ్గర సీఎం రేవంత్ మాత్రం ఇచ్చిన హామీలే అమలు చేయలేకపోతున్నారంటూ విమర్శించారు.