ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల ఖర్చుపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు, గత ఎడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం అన్ని శాఖల్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని… అమలుకు సపోర్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.