సద్దుల బతుకమ్మ రోజు రెండు బతుకమ్మలు చేస్తారు. ఎందుకంటే.. ఆడబిడ్డకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేటప్పుడు తోడుగా మరొకరిని పంపుతారు. అచ్చు అలాగే బతుకమ్మని కూడా సాగనంపుతారు. అంతేకాకుండా పెద్ద బతుకమ్మను తల్లిగా, చిన్న బతుకమ్మను కూతురుగా భావించి పాటలు పాడుతూ పండుగను జరుపుకుంటారు.