TG: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మ మొదటి రోజును ‘పెత్రమాస’ అంటారు. కత్తితో కోసినా.. నోటితో కొరికినా ఆ పూలు ఎంగిలి అయినట్లు భావిస్తారు. కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అయింది. స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటారు. సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మను ప్రారంభిస్తారు. నువ్వులు, బియ్యం పిండి, పుట్నాలు ప్రసాదంగా పెడతారు.