AP: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.