అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెంటగాన్ మిలిటరీ అధికారులపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కూడా ఉంటారని సమాచారం. పెంటగాన్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం యత్నిస్తోంది. కాగా, తనను విమర్శించిన డిఫెన్స్ లీడర్స్‌పై ట్రంప్ గతంలో తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే.