TG: మోదీ హఠావో.. ఓబీసీ బచావో అని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు పిలుపునిచ్చారు. మోదీ రిమోట్ మోహన్ భగవత్ దగ్గర ఉందని ఆరోపించారు. దేశాన్ని ముక్కలు చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ కుట్రలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని అన్నారు. కేంద్రం చేస్తున్న జనగణనలో బీసీల ప్రస్తావన లేదని మండిపడ్డారు. జనగణనలో కులగణన కూడా చేయాలని డిమాండ్ చేశారు.