TGG ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్పై మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్వక్తం చేశారు. అవి గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా? అని ప్రశ్నించారు. పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. రేవంత్ ఇందుకేనా విజయోత్సవాలు జరుపుతున్నది? ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? అని నిలదీశారు.