ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు నివాళులర్పించారు. యర్రంపల్లిలోని ఆయన నివాసంలో పార్టీ జెండా కప్పి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వార్డు సభ్యుని నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన మరణం తీరని లోటని నేతలు అన్నారు.