లివిన్ రిలేషన్షిప్స్ వల్ల సమాజం నాశనం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గడ్కరీ లివిన్ రిలేషన్‌పై మాట్లాడుతూ.. వాళ్లు పిల్లల్ని ఎలా కంటారు, ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతోంది అని ప్రశ్నించారు. పిల్లల్ని పెంచడమనేది బాధ్యత, వారిని సురక్షితంగా చూసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలని వెల్లడించారు. యూరోప్ దేశాల్లో యువత వివాహాలు చేసుకోవడం లేదని, అది పెద్ద సమస్యగా మారిందన్నారు.