ప్రకాశం: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీన ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించ నున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ డి. కళ్యాణి తెలిపారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు తమ కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ చేత ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలన్నారు.