బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ ఐదో రోజు ఆటలో భారత్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం 33 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు మెక్‌స్వీనీ (4), ఖవాజా (8), లబుషేన్(1), మార్ష్ (2), స్మీత్ (4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. బుమ్రా, ఆకాష్ దీప్ చెరో రెండు వికెట్లు.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.