ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్‌కు గోవా సీఎం ప్రమోద్ సావంత్ సతీమణి సులక్షణా సావంత్ షాక్ ఇచ్చారు. గోవాలో విలేకరుల సమావేశంలో తన పేరును ‘క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్’లో పేర్కొన్నందుకు సంజయ్ సింగ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సంజయ్ సింగ్‌పై గోవాలోని బిచోలిమ్‌లోని సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో జనవరి 10 లోగా సమాధానం ఇవ్వాలని ఎంపీని కోర్టు ఆదేశించింది.