ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కల్యాణదుర్గంలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆమె కల్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇంటికి మర్యాదపూర్వకంగా వెళ్లారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు శాలువా, పూలమాలతో పరిటాల సునీతను సన్మానించారు. ఇద్దరూ కాసేపు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చర్చించారు.