సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలపై నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఫైరయ్యారు. పూర్తి విషయం తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. ఇటీవల తాను తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీని హీరో అజిత్ మెచ్చుకున్నారంటూ శివన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అవి అబద్ధం అంటూ పలువురు నెటిజన్లు ట్రోల్ చేశారు.