తెలంగాణ భూభారతి బిల్లు 2024ను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. సవరణ బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ భూములను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత మా ప్రభుత్వానిది. ధరణి పోర్టల్ వల్ల లక్షలాది సమస్యలు వచ్చాయి. ROR చట్టం 2020ని పూర్తిగా ప్రక్షాళన చేసి భూభారతి తెచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశాము’ అని తెలిపారు.