అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ ప్రకటించి అశ్విన్ తనను భావోద్వేగానికి గురిచేశాడంటూ విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ’14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో కలిసి ఆడిన జ్ఞాపకాలు నా కళ్ల ముందు మెరిశాయి. నీతో చేసిన ప్రయాణంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ఇండియన్ క్రికెట్ లెజెండ్‌గా గుర్తుండిపోతావు’ అని తెలిపాడు.