‘బేబీ జాన్’ మూవీ ప్రమోషన్లో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ‘నా ఆరో సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇది అవుట్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది. దేశం గర్వించేలా ఉండే ఈ సినిమా ఎవరి ఊహలకు అందనివిధంగా ఉంటుంది. నటీనటుల ఎంపిక చివరి దశలో ఉంది. త్వరలోనే క్యాస్టింగ్ ప్రకటనతో సర్ప్రైజ్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు.