స్పేస్ నుంచి సునీతా విలియమ్స్ భూమిపైకి తిరిగొచ్చే ప్రక్రియ ఆలస్యం కానుంది. ఈ ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ వెళ్లారు. అయితే స్టార్‌లైనర్ ప్రపోల్షన్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారు అక్కడే ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో వారిని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేయగా.. అది మార్చి వరకు ప్రారంభం కానుంది.