JGL: ధర్మపురి పుణ్యక్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని విగ్నేశ్వరుని ఆలయంలో బుధవారం సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం గణనాథునికి ఆలయ అర్చకులు, వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో వేదోక్తంగా క్షీరాభిషేకం నిర్వహించారు.