బెంగుళూరులో విదేశీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. రూ.24 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన రోజ్ లైమ్ అనే నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 12 కేజీల MDMA, 70 సిమ్ కార్డులు సీజ్ చేశారు. అలాగే పరారీలో ఉన్న విదేశీ మహిళ జూలియట్ కోసం గాలింపు చెర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.