KDP: బ్రహ్మంగారి మఠం మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ, గ్రామాల అభివృద్ధి అంశంపై మండల స్థాయి అధికారులకు, గ్రామ సచివాలయ సిబ్బంది శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి వెంగముని రెడ్డి పాల్గొని పంచాయతీ, గ్రామాల అభివృద్ధికై పలు విషయాలను తెలియజేశారు.