HYD: ఎల్బీనగర్ జోన్ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సేకరించిన కుటుంబాల సంఖ్యను అధికారులు వెల్లడించారు. 3,84,217 కుటుంబాలు ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. సర్వే పూర్తి చేసిన అధికారులు డిజిటలైజేషన్‌పై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లుగా వెల్లడించారు.