అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. గబ్బాలో ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. తన కెరీర్లో మొత్తం 106 టెస్టులు ఆడిన అశ్విన్ 537 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్లు సాధించాడు. మరోవైపు 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు.