గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఫాలోఆన్ నుంచి తప్పించుకోవడంపై ఆసీస్ జట్టు సహాయక కోచ్ డానియల్ వెటోరీ స్పందించాడు. ‘భారత్‌ను ఎలాగైనా ఫాలోఆన్ ఆడించాలని అనుకున్నాం. జడేజా ఔట్ అయినప్పుడు మంచి అవకాశం కనిపించింది. ఆఖరి వికెట్ తీయడానికి తీవ్రంగా ప్రయత్నించాం. కానీ బుమ్రా, ఆకాశ్ దీప్‌లు విలువైన భాగస్వామ్యం నెలకొల్పి మా ఆశలపై నీళ్లు చల్లారు’ అని పేర్కొన్నాడు.