SKLM: ఆమదాలవలస మండలంలోని ఆర్ఆర్ కాలనీలో హత్యకు గురైన మహిళ కేసులోని నిండుతుడు సొండి సురేష్‌ను పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. సంగమేశ్వర స్వామి కొండపైన ఉన్న నిందితుడు ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు దొరక్కుండా నానా అగచాట్లకు గురిచేసి చివరకు కొండ దిగువ భాగాన భవానీ సన్నిధానం వద్ద పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు.