SKLM: కొత్తూరు మండలం జగన్నాథపేట సమీపంలో పంట పొలాల్లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 30 బస్తాల ధాన్యం దగ్ధమైంది. ఇదే మండలం బలద గ్రామానికి చెందిన పూర్ణచంద్ర పాణిగ్రాహి రైతు పొలంలో ధాన్యం బస్తాలను ఉంచారు. గుర్తుతెలియని వ్యక్తులు పొలానికి నిప్పు పెట్టడంతో అగ్ని మంటలు ఎగసిపడి ధాన్యం బస్తాలు కాలిపోయాయి. ఆస్ఐ, గ్రామ పెద్దలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.