ప్రకాశం: కనిగిరి పట్టణంలో టవర్ వర్కుల కారణంగా బుధవారం ఉదయం 9.00 గంటల నుంచి 1.00 గంట వరకు టౌన్ – 3, ఫీడర్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పవిత్రా ఏరియా, గవర్నమెంటు హాస్పిటల్, పామూరు బస్ స్టాండ్ సెంటర్, తదితర ప్రాంతాలలో సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.