భారత్ అధికంగా సుంకాలు విధిస్తోందని అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆక్షేపించారు. ఇదే ఒరవడి కొనసాగితే తాము కూడా పన్నులు విధిస్తామని హెచ్చరించారు. అన్ని సందర్భాల్లో భారత్.. అమెరికా దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తోందని.. 100, 200 ఛార్జ్ చేస్తున్నారని.. అలాగే బ్రెజిల్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందన్నారు. మాపై ఛార్జ్ చేస్తున్నప్పుడు మేమూ అలాగే చేస్తామని వ్యాఖ్యానించారు.