భారత్తో కలిసి ద్వైపాక్షిక సంబంధాలను స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపిస్తామని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు. ఈ మేరకు భారత్, చైనా కలిసి ఓ అంగీకారానికి వచ్చాయని తెలిపారు. రష్యాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన సందర్భంగా ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన దేశాలపై చైనా ఎక్కువ నమ్మకం, తక్కువ అపనమ్మకంతో ఉందని వ్యాఖ్యానించారు.