కృష్ణా: విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో సివిల్ సర్వీస్ స్టడీ సర్కిల్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత హాజరవుతారని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం సూచించింది.