కృష్ణా: డిసెంబర్ 20న నూజివీడు నియోజకవర్గంలో భారీ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో 40 భారీ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కి రాలేదని విమర్శించారు.