పంజాబ్ రైతు నేత జగ్జిత్ సింగ్ డల్లేవాల్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష 21 రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చ నేత రాకేష్ టికాయత్ రైతు సంఘాల మధ్య ఐక్య పోరాటానికి పిలుపునిచ్చారు. రైతు సంఘాలన్నీ ఏకమవ్వాలని లేదంటే ఓటమి తప్పదని సూచించారు. ఈ మేరకు ‘మీరు ఏకం కాకపోతే ఓడిపోతారు’ అనే నినాదాన్ని వినిపించారు. అలాగే డల్లేవాల్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.