GNTR: మంగళగిరిలోని AIIMSలో నేడు జరగనున్న ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు ధ్రువపత్రాలను ప్రదానం చేయనున్నారు. అలాగే దేశంలో ఆరోగ్య రంగం అభివృద్ధి కోసం జరుగుతున్న చర్యలపై ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి రాకతో అధికారులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.