సత్యసాయి: టీడీపీతోనే రైతు సంక్షేమాభివృద్ధి సాధ్యమని, రైతుల సంక్షేమం కోసం చిత్త శుద్ధితో పనిచేయాలని సాగు నీటి సంఘాల కమిటీలకు మంత్రి సవిత సూచించారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లు.. మంత్రిని కలిశారు. మంత్రి మాట్లాడుతూ.. రైతు కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సీఎం ధ్యేయమన్నారు.