AP: మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు కుటుంబం దర్శించుకుంది. అనంతరం టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు దేవాన్ష్ పేరు మీద రూ.44 లక్షల విరాళం అందించింది. అలాగే చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేశారు. తర్వాత భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు.