పెళ్లి సంబంధాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు ఆస్తులు, జీతం చూసే అమ్మాయి తరపు వారు.. ఇప్పుడు అబ్బాయిల ‘సిబిల్ స్కోర్’ చెక్ చేస్తున్నారు. అప్పులు తీర్చడంలో క్రమశిక్షణ లేకున్నా, స్కోర్ 750 కంటే తక్కువ ఉన్నా సంబంధం రద్దు చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లికి ఆస్తులే కాదు, అబ్బాయిల ‘ఆర్థిక క్రమశిక్షణ’ కూడా కీలకమే. సో, పెళ్లికాని ప్రసాద్‌లు.. మీ సిబిల్ స్కోర్ జాగ్రత్త.