TG: రాష్ట్రంలో తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. అయితే ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి సర్పంచ్ అభ్యర్థిని, మరొకటి వార్డు మెంబర్ను ఎన్నుకునేందుకు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇందుకు రెండు ఓట్లు వేర్వేరుగా వేయాలి. కాగా, పోలింగ్ జరిగే గ్రామాల్లో అధికారులు సెలవు ప్రకటించారు.