TG: నల్గొండ జిల్లాలో 3 కొత్త ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం అనుమతి లభించింది. 4,231 ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా 3 లిఫ్ట్‌లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పునుగోడు, నర్సింగ్ బట్ల, దోమలపల్లి ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇచ్చింది. రూ. 44 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.