TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో DTC కిషన్ నాయక్‌కు ACB కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను చంచల్ గూడా జైలుకు తరలించారు.నిన్నటి సోదాల్లో కిషన్‌కు చెందిన స్థిర, చర ఆస్తుల విలువ 400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాడులు జరుగుతాయని ముందే ఊహించిన కిషన్ తన వద్ద ఉన్న బంగారాన్ని వేరే చోటికి తరలించినట్లు అధికారులు గుర్తించారు.