TG: సీఎం రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ఇంటింటి కుటుంబ సర్వే విధుల నుంచి ఎస్జీటీలను మినహాయించాలని, సర్వేకు ఎస్జీటీలను వినియోగించడం విద్యాహక్కు చట్టం కింద ఉల్లంఘనేనని పేర్కొన్నారు. సర్వేకు ఎస్జీటీలు, హెచ్ఎంలను భాగం చేస్తూ ఉత్తర్వులిచ్చారని.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమన్నారు. సర్కార్ అనాలోచిత నిర్ణయాలు విద్యార్ధులు, టీచర్లకు శాపాలని అన్నారు.