మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అటవీ శాఖను మినహాయించి ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిజర్వేషన్ను కల్పించేందుకు ప్రభుత్వం మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (మహిళల నియామకం కోసం ప్రత్యేక నిబంధన) రూల్స్, 1997కి సవరణ చేసింది. గతంలో పంచాయతీలు, పట్టణ సంస్థల ఎన్నికలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను మధ్యప్రదేశ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.