చలికాలంలో సాధారణంగా చర్మం పొడిగా మారి పగులుతుంటుంది. దీనికి పలు కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో వీచే పొడి గాలుల కారణంగా చర్మంలోని తేమ తగ్గిపోతుంది. వాటర్ తక్కువగా తాగటం వలన స్కిన్ డీహైడ్రేట్ అయి పొడి బారుతుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వలన చర్మంలోని సహజ తేమ తొలగిపోతుంది. విటమిన్ ఎ, సి, డి లోపం కూడా చర్మంపై పగుళ్లు ఏర్పడటానికి ఒక కారణం. పొడి చర్మంపై లోషన్స్ రాయడం వలన స్కిన్ మరింత పాడయ్యే అవకాశం ఉంటుంది.